తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆ నగదు మా సంస్థదే.. మంత్రికి ఏ సంబంధం లేదు' - పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదేనన్న నల్లమల్లి బాలు

తమిళనాడులో పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదేనని... బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు తెలిపారు. అందరూ విమర్శిస్తున్నట్లు ఆ నగదుతో ఏపీ మంత్రి బాలినేనికి, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలిపారు.

seized-cash-is-belonged-to-our-business-and-minister-has-no-involvement-in-this-case-says-gold-business-man-balu
'పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదే.. మంత్రికి ఏ సంబంధమూ లేదు'

By

Published : Jul 17, 2020, 5:18 PM IST

తమిళనాడులో పట్టుబడిన నగదు తమ వ్యాపార సంస్థదేనని... బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా నగలు కొనేందుకు చెన్నై తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ను మా డ్రైవర్‌ వేశారు. కాలం చెల్లిన స్టిక్కర్‌ను ఎక్కడ సంపాదించాడో తనకు తెలియదని బాలు పేర్కొన్నారు. అందరూ విమర్శిస్తున్నట్లు ఆ నగదుతో ఏపీ మంత్రి బాలినేనికి, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details