తెలంగాణ

telangana

ETV Bharat / city

నేరాలకు మద్యమే కారణం: సీతక్క - telangana assembly budget session 2020

రాష్ట్రంలో నేరాలకు మద్యమే కారణమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గినట్లు సభలో మంత్రి చెప్పటం సరైందికాదని పేర్కొన్నారు. గవర్నర్​ ప్రసంగం సీఎంను పొగిడే విధంగా ఉందని విమర్శించారు.

seetakha speech on liquor
నేరాలకు మద్యమే కారణం: సీతక్క

By

Published : Mar 7, 2020, 12:56 PM IST

గవర్నర్‌ ప్రసంగం సీఎంను పొగిడే కార్యక్రమంగా తలపించిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గవర్నర్​ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి, నిధులు, అప్పుల ప్రస్తావనే లేదని చెప్పారు. రాష్ట్రంలో నేరాలకు మద్యమే కారణమవుతోందని అభిప్రాయపడ్డారు.

మద్యం కారణంగా ఇన్ని నేరాలు జరుగుతున్నా.. లిక్కర్​ అమ్మకాలు తగ్గినట్లు సభలో మంత్రి చెప్పటం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో మద్యం నియంత్రణ పాలసీలు లేవని మండిపడ్డారు.

నేరాలకు మద్యమే కారణం: సీతక్క

ABOUT THE AUTHOR

...view details