హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్వంలో లండన్లో నిరాడంబరంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. లండన్లోని రీడింగ్ నగరంలోఎనిమిది సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసి.. భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది కరోనా నిబంధనల వల్ల గణపతి నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించినట్టు యూత్ అధ్యక్షులు అశోక్ గౌడ్ తెలిపారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ స్ఫూర్తితో ఈ ఏడాది విత్తన గణపతిని ప్రతిష్టించి పూజలు చేసినట్టు ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతు బాధ్యతగా ఇకపై ప్రతి ఏడాది విత్తన, మట్టి గణపతినే ప్రతిష్టిస్తామని ఆయన తెలిపారు. విత్తన గణపతిని ఇంటి ఆవరణలోనే తొట్టిలో నిమజ్జనం చేశారు.
లండన్లో ముగిసిన.. విత్తన గణపతి నిమజ్జనం! - గణేష్ నవరాత్రి ఉత్సవాలు
లండన్లోని రీడింగ్ నగరంలో హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో విత్తన గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్టు యూత్ అధ్యక్షులు అశోక్ గౌడ్ తెలిపారు. జోగినపల్లి సంతోష్ రావు స్ఫూర్తితోనే ఈ ఏడాది విత్తన గణపతిని ప్రతిష్టించినట్టు ఆయన తెలిపారు.
లండన్లో ముగిసిన.. విత్తన గణపతి నిమజ్జనం!