ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ఓయూ గేట్లు మూసివేత - 13th day of tsrtc strike
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో పదమూడో రోజుకు చేరింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఓయూ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమస్యల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదమూడో రోజుకు చేరింది. రాజకీయ, ఉద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈనేపథ్యంలో పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయం గేట్లను మూసివేసి... రాకపోకలను నిలిపివేశారు. భారీ బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం