తెలంగాణ

telangana

ETV Bharat / city

పేర్నిపై దాడి ప్రభావం.. కొడాలి ఇంట్లో భద్రత కట్టుదిట్టం - మంత్రి కొడాలి నాని ఇంట్లో భద్రత వార్తలు

ఏపీ మంత్రి పేర్నినానిపై దాడి ఘటనను పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు. మంత్రుల ఇళ్ల దగ్గర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఇంట్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

పేర్నిపై దాడి ప్రభావం.. కొడాలి ఇంట్లో భద్రత కట్టుదిట్టం
పేర్నిపై దాడి ప్రభావం.. కొడాలి ఇంట్లో భద్రత కట్టుదిట్టం

By

Published : Dec 3, 2020, 5:13 PM IST

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీలో అన్ని జిల్లాల్లో మంత్రుల నివాసం, కార్యాలయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. జిల్లా పోలీసులు మంత్రి కొడాలి నాని నివాసంలో మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు.

భద్రతా అధికారులు మంత్రి ఇంటిని వారి అధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ తో అణువణువునా పోలీసులు పరిశీలించారు. మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసి సందర్శకులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి:కౌెంటింగ్​కు అంతా సిద్దం : ఓల్డ్‌ మలక్‌పేటలో సీపీ అంజనీకుమార్

ABOUT THE AUTHOR

...view details