సికింద్రాబాద్ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్డీవో వసంతకుమారి ముంపు ప్రాంతాల బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు పంచిన ఆర్డీవో - హుస్సేన్ సాగర్
సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
వరద ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లు పంచిన ఆర్డీవో
ముషీరాబాద్ నియోజకవర్గంలోని హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంతాలైన అరుంధతి నగర్లో హిదాయత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షాహిద్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆర్డీవోతో పాటు.. తహశీల్దార్ జానకి, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:చెరువుల ఆక్రమణే ఈ దుస్థితికి కారణం