తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2022, 3:27 PM IST

ETV Bharat / city

ముగిసిన ఆవుల సుబ్బారావు కస్టడీ.. పలు కోణాల్లో పోలీసుల విచారణ..

Secunderabad Riots Case: సికింద్రాబాద్​ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు కస్టడీ ముగిసింది. సుబ్బారావుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు.

Secunderabad Riots Case accused avula subbarao custody completed
Secunderabad Riots Case accused avula subbarao custody completed

Secunderabad Riots Case: అగ్నిపథ్​కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావుతో పాటు మరో ముగ్గురికి కస్టడీ ముగిసింది. ఆవుల సుబ్బారావుతో పాటు అతడి ముగ్గురు అనుచరులను రెండు రోజుల పాటు రైల్వే పోలీసులు ప్రశ్నించారు. ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆవుల సుబ్బారావును ఘటనకు సంబంధించి పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు.

ఘటన జరిగే ముందు రోజు.. సికింద్రాబాద్​లోనే ఉండి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, రైల్వేస్టేషన్ విధ్వంసం సంబంధించి వ్యూహాలను రచించడం, విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి వారిని ఉసిగొల్పే విధంగా ప్రేరేపించడం వంటి అంశాలపై ఆరా తీశారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సుబ్బారావు విచారణలో చెప్పినట్లు తెలిసింది. కస్టడీ ముగిసిన అనంతరం.. సుబ్బారావుతో పాటు మరో ముగ్గురిని గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్​గూడా జైలుకు తరలించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details