కరోనా కట్టడిలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో.. మాస్క్ ధరించనివారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 30 మంది ప్రయాణికులకు రూ. 500 చొప్పున జరిమానా విధించారు. రెండో దశలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్ ధరించాలని రైల్వే ఎస్పీ అనురాధ స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ రైల్వే కీలక నిర్ణయం: మాస్క్ లేకపోతే ఫైన్ - రైళ్లలో కొవిడ్ నిబంధనలు
కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్లాట్ఫాం, పరిసర ప్రాంతాలు, రైల్లో ప్రయాణించేవారంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రైల్వే ఎస్పీ అనురాధ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన పలువురికి రూ .500 జరిమానా విధించారు.
సికింద్రాబాద్ రైల్వే మాస్క్ ఫైన్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు... రైళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించాలని అనురాధ విజ్ఞప్తి చేశారు. భౌతిక దూరం వంటి నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కొవిడ్ కట్టడికి సహకరించాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి:మీ కుటుంబం విలువ రూ.5 వేల కంటే తక్కువా?