తెలంగాణ

telangana

ETV Bharat / city

అఖిలప్రియ బెయిల్ పిటిషన్​ తిరస్కరించిన న్యాయస్థానం - kidnap case updates

అఖిలప్రియ బెయిల్ పిటిషన్​ తిరస్కరించిన న్యాయస్థానం
అఖిలప్రియ బెయిల్ పిటిషన్​ తిరస్కరించిన న్యాయస్థానం

By

Published : Jan 18, 2021, 2:52 PM IST

Updated : Jan 18, 2021, 3:21 PM IST

14:48 January 18

అఖిలప్రియ బెయిల్ తిరస్కరించిన సికింద్రాబాద్ కోర్టు

కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ బెయిల్​ పిటిషన్​ను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. అఖిలప్రియపై పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో దాఖలు చేశారు. అదనపు సెక్షన్ల నమోదుతో బెయిల్ పిటిషన్​ను కోర్టు తిరస్కరించింది.

ప్రవీణ్ రావు సోదరులను అపహరించిన కేసులో ఈ నెల 6న బోయిన్ పల్లి పోలీసులు అఖిలను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. దర్యాప్తులో పురోగతి కోసం ఈ 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కస్టడీ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాాలేదని... పోలీసుల కస్టడీ కూడా పూర్తయినందున బెయిల్ మంంజూరు చేయాలని అఖిల ప్రియ కోరారు. పోలీసులు మాత్రం అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేశారు. 

అపహరణ కేసులో ఇతర నిందితులు భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుతో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నారని పోలీసులు కౌంటర్ లో పేర్కొన్నారు. అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర నిందితులు దొరికే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. 

సికింద్రాబాద్​ కోర్టు తిరస్కరించిన కారణంగా... నాంపల్లి కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'సరైన వివరణ ఇవ్వకపోతే.. తగిన ఆదేశాలిస్తాం'

Last Updated : Jan 18, 2021, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details