భారీ వర్షాలతో ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ రూ. 550 కోట్లు విడుదల చేశారని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్‌పేట, మోండా మార్కెట్, బన్సీలాల్‌పేట డివిజన్లలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయాన్ని కార్పొరేటర్లతో కలిసి అందజేశారు.
'ప్రజల అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం'
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్‌పేట, మోండా మార్కెట్, బన్సీలాల్‌పేట డివిజన్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ పర్యటించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయాన్ని కార్పొరేటర్లతో కలిసి అందజేశారు.
వరద ముంపునకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు, పూర్తిగా కూలిపోయిన ఇంటికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. బాధితులకు సాయం అందించే విషయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత త్వరగా స్పందించలేదని పేర్కొన్నారు.
నగరంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ, పారిశుద్ధ్య పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తలసాని సాయికిరణ్ యాదవ్ పేర్కొన్నారు.