తెలంగాణ

telangana

ETV Bharat / city

'సచివాలయ నిర్మాణ, అంచనా వ్యయం వివరాలు ఇవ్వండి' - secretariate case hearing

సచివాలయం కూల్చివేత కేసు విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది. నిర్మాణ, అంచనా వ్యయం పూర్తి వివరాలు అందించాలని అదనపు ఏజీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

సచివాలయం కూల్చివేత కేసు వచ్చే నెల 12కు వాయిదా
సచివాలయం కూల్చివేత కేసు వచ్చే నెల 12కు వాయిదా

By

Published : Jan 27, 2020, 4:24 PM IST

Updated : Jan 27, 2020, 8:26 PM IST

సచివాలయ కూల్చివేత కేసు విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది. సచివాలయ నిర్మాణం, అంచనా వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అదనపు ఏజీ రాంచందర్ రావును హైకోర్టు ఆదేశించింది. నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఈ రోజు వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపించారు.

సచివాలయం నిర్మాణానికి సబంధించిన చర్యల గురించి ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయాన్ని కూల్చివేయొద్దన్న హైకోర్టు ఆదేశాలతో... ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని అదనపు ఏజీ తెలిపారు. కూల్చివేత ఆపాలని మాత్రమే ఆదేశాలిచ్చామని.... నిర్మాణానికి సంబంధించిన నమూనా రూపకల్పన, అంచనా వ్యయం విషయంలో ఎలాంటి స్టేలు ఇవ్వలేదు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణానికి 3 నుంచి 4 వందల కోట్లు ఖర్చు అవ్వొచ్చని అదనపు ఏజీ ధర్మాసనానికి తెలిపారు.

ఇదీ చూడండి: సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Last Updated : Jan 27, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details