సచివాలయం కూల్చివేత వివాదంపై హైకోర్టు స్పష్టతనిచ్చిన నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు ఖాళీ చేస్తున్నారు. ప్రాంగణంలో ఉన్న పాత, నిరూపయోగమైన వాహనాలను బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల మైదానానికి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఐ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిరూపయోగంగా ఉన్న సుమారు 120 వాహనాలను తరలిస్తున్నారు. ఇందులో పనికొచ్చే వాహనాలను గుర్తించి... మిగిలినవాటిని తుక్కు సామగ్రి సంస్థలకు విక్రయించనున్నారు.
నిజాం కళాశాల మైదానానికి సచివాలయం వాహనాలు.. - నిజాం కళాశాల మైదానానికి సచివాలయం వాహనాలు
నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డుంకులు తొలగిన వేళ.. ఆ ప్రాంగణాన్ని అధికారులు ఖాళీ చేస్తున్నారు. ప్రాంగణంలో ఉన్న పాత, నిరూపయోగమైన 120 వాహనాలను బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల మైదానానికి తరలిస్తున్నారు.

నిజాం కళాశాల మైదానానికి సచివాలయం వాహనాలు..
సచివాలయం కూల్చివేతపై మంత్రి మండలి నిర్ణయంలో తప్పు కనిపించలేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సచివాలయం కూల్చివేత అంశంపై రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, పీఎల్ విశ్వేశ్వరరావు సహా.. ఇతరులు వేసిన పిటిషన్లన్నింటినీ హైకోర్టు కొట్టేసింది.