రాష్ట్ర నూతన సచివాలయం నమూనా విడుదల చేసిన సర్కారు - undefined
08:53 July 07
రాష్ట్ర నూతన సచివాలయం నమూనా విడుదల చేసిన సర్కారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నూతన రాష్ట్ర సచివాలయం నమూనా ఖరారైంది. తాజాగా సచివాలయం నమూనా చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని నిర్ణయించింది. కానీ న్యాయపరమైన అడ్డంకులు వచ్చిపడ్డాయి.
ఇటీవల హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేతకు.. కొత్త సచివాలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజామునుంచే సచివాలయ భవనాల కూల్చివేత పనులను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ వెంటనే కొత్త సచివాలయ నమూనా విడుదల చేసింది.
TAGGED:
secretariat