కరోనా ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి రంగం నెమ్మదించింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. పెద్ద పెద్ద సంస్థలు మినహా పూర్తిగా నిర్మాణాలు ఆగిపోయాయి. నిర్దేశించిన సమయంలో లబ్దిదారులకు అందచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలపై నిర్మాణ రంగం 90శాతం ఆధారపడుతోంది.
స్థిరాస్తి రంగంపై రెండో దశ కరోనా ప్రభావం - covid effect on telangana real estate field
రాష్ట్ర స్థిరాస్తి రంగంపై కరోనా రెండో దశ ప్రభావం పడింది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లడం వంటి కారణాలతో ప్రభుత్వం అనుమతిచ్చినా.. పెద్దపెద్ద సంస్థలు మినహా పూర్తిగా నిర్మాణాలు ఆగిపోయాయి.
రియల్ ఎస్టేట్, స్థిరాస్తి రంగం, స్థిరాస్తి రంగంపై కరోనా ప్రభావం
కరోనా రెండో దశ భయంతో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లడం వల్ల పలు నిర్మాణాలు వాయిదా పడ్డాయి. మరికొన్ని ఉన్న కూలీలతో నెట్టుకొస్తుండటం వల్ల నెమ్మదించాయి. కరోనా రెండో వేవ్ ప్రభావం నిర్మాణ రంగంపై ఏలా ఉంది? లాక్‌డౌన్ సమయంలోనూ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో...తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎప్పటిలోపు స్థిరాస్తి రంగం తిరిగి కోలుకుంటుంది? ధరలు ఎలా ఉండనున్నాయి? తదితర అంశాలపై హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
- ఇదీ చదవండి :పతనం దిశగా ఆర్థిక వ్యవస్థ!