హైదరాబాద్ గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో మరోసారి భూప్రకంపనలు కాలని వాసులను ఆందోళనకు గురిచేశాయి. ఆదివారం ఉదయం భూమి నుంచి భారీ శబ్దాలు రాగా... ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. 4 రోజుల క్రితం కూడా టీఎన్జీవోస్ కాలనీలో భూప్రకంపనలు వచ్చాయి. జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్కియాలజీ అధికారులు కాలనీని సందర్శించారు. భూకంపం వచ్చిందని... ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియజేశారు.
గచ్చిబౌలిలో మరోసారి భూప్రకంపనలు... బ్లాస్టింగ్లే కారణమంటున్న స్థానికులు
హైదరాబాద్లో ఓ వైపు వరుణుడు ఆగ్రహిస్తుంటే... మరోవైపు భూమాత ప్రకోపిస్తోంది. గచ్చిబౌలిలో మరోసారి భూమి కంపించగా.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇది భూకంపం కాదని... చుట్టుపక్కల చేస్తున్న బ్లాస్టింగులే వల్లే ఈ ప్రకంపనలని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గచ్చిబౌలిలో మరోసారి భూప్రకంపనలు... బ్లాస్టింగ్లే కారణమంటున్న స్థానికులు
మరోవైపు స్థానికులు మాత్రం కాలనీలో భూకంపం రాలేదని... చుట్టుపక్కల చేపడుతున్న భారీ నిర్మాణాల్లో బ్లాస్టింగ్ చేయడం వల్లనే ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బ్లాస్టింగ్లను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.