సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తాత్కాలిక సిబ్బంది ఐడీ కార్డులు పరిశీలించాకే విధుల్లోకి అనుమతిస్తున్నారు. ప్రత్యామ్నాయ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.
సికింద్రాబాద్ హకీంపేట్ డిపో వద్ద విధులకు హాజరయ్యేందుకు వచ్చిన 15 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లో చేర్చుకునేందుకు ప్రభుత్వం నిరాకరించడం సరైన చర్య కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హకీంపేట్ డిపో వద్ద పెద్దఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇంట్లో నుంచి...
ఖమ్మం డిపో వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ మహిళా కార్మికులు ఇంట్లో సమావేశమైన ఐదుగురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుర్హన్పురంలో విధుల్లో చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు మధ్యలోనే అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.