ఎన్టీఆర్(NTR)కు భారతరత్న ఇప్పించటమే నిజమైన నివాళని తెలుగుదేశం మహానాడు స్పష్టం చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు(Nandamuri Taraka rama rao)కు ఘననివాళులు అర్పిస్తూ... రెండో రోజు మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ప్రతిమకు తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించి.. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
'ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక-సామాజిక న్యాయ ప్రధాత ఎన్టీఆర్'కు నివాళి పేరిట అశోక్ గజపతి రాజు(Ashok Gajapathi Raju) ప్రవేశపెట్టిన తీర్మానాన్ని.. తెలంగాణ తెదేపా అధ్యక్షులు ఎల్.రమణ, నందమూరి బాలకృష్ణ, పీఆర్ మోహన్, శ్రీపతి సతీష్, గొల్లపల్లి సూర్యారావు తదితరులు బలపరిచారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అశోక్ గజపతిరాజు కోరారు. ప్రాంతాలకు అతీతంగా బడుగు, బలహీనవర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ పనిచేశారని ఎల్.రమణ కొనియాడారు.