Floods at Dhavaleswaram :ఆంధ్రప్రదేశ్లోధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 14.20 అడుగులకు చేరగా.. 13.37లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కాల్వలకు 8800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జాలర్లు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి.
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ - Rising flood for Dhavaleshwaram project
Dhavaleswaram: ఏపీలో ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు బ్యారేజ్ నీటిమట్టం 14.20 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గోదావరి