ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, హెచ్‌పీ సీఈవోలు, పంచాయతీరాజ్ అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్వహించ తలపెట్టిన వీడియోకాన్ఫరెన్స్ మరోసారి రద్దయ్యింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి అనుమతి రాకపోవడంతో.. వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని కలెక్టర్లు తెలిపారు.
స్థానిక ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహణ కోసం గతంలోనే ఎస్ఈసీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేనందున సమావేశం అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని నిమ్మగడ్డకు ప్రత్యుత్తరం పంపారు. దీంతో నిన్న జరగాల్సిన వీడియోకాన్ఫరెన్స్ రద్దయ్యింది.