నాలుగు నగరపాలక సంస్థలపై ఏపీ ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, ధనం, మద్యం ప్రభావంపై విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందాయి.
డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచిన ఎస్‌ఈసీ - Ap news
ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ధనం, మద్యం ప్రభావంపై విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ఆదివారం ఉదయం.. అధికారులతో చర్చించనున్నారు.

డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచిన ఎస్‌ఈసీ
ఆదివారం ఉదయం 11 గంటలకు సంబంధిత అధికారులతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచి.. నియంత్రించాలని అధికారులకు ఆదేశించింది.
ఇదీ చదవండి:కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్