ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిలిపివేయాలంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై అప్పీలుకు వెళ్లాలన్న యోచనలో ఎస్‌ఈసీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై.. హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న ఎస్ఈసీ - హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఎస్‌ఈసీ
ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది.
ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్నీ