ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు రద్దు చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశముంది.
ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ఎస్‌ఈసీ పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్‌ఈసీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో రేపు(గురువారం) విచారణ జరిగే అవకాశం ఉంది.
ఏపీలో ఏప్రిల్ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఏప్రిల్ 1న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఆ నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏప్రిల్ 1న ఇచ్చిన ఎన్నికల ప్రకటన చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్‌ఈసీని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు రూ.160 కోట్లు ఖర్చు అయిందని ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఎన్నికల కమిషనర్ చేసిన అభ్యర్థనను అనుమతిస్తే.. చట్టవిరుద్ధమైన చర్యను సక్రమం చేయడమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో ఎస్‌ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.