తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్‌ఈసీ సవాల్​పై హైకోర్టు విచారించే అవకాశం - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

పరిషత్ ఎన్నికల నిలుపుదలపై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ఎస్‌ఈసీ సవాల్‌ చేసింది. ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు చేస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్​ తలుపుతట్టింది.

ap high court news, Andhra Pradesh HC
ఎస్‌ఈసీ సవాల్​పై హైకోర్టు విచారించే అవకాశం

By

Published : Apr 7, 2021, 6:48 AM IST

పరిషత్ ఎన్నికల నిలుపుదలపై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ఎస్‌ఈసీ సవాల్‌ చేసింది. ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు చేస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్​ తలుపుతట్టింది. ఈ మేరకు డివిజన్‌ బెంచ్‌లో ఎన్నికల సంఘం తరఫున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

అప్పీలు చేసిన కార్యదర్శి

పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ... ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు అప్పీల్ దాఖలు చేశారు.

వ్యక్తిగత హోదాలో వేశారు !

ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన తెలుగుదేశం నేత వర్ల రామయ్.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని.... వ్యక్తిగత హోదాలో అయన వేసిన వ్యాజ్యాన్ని.. సింగిల్ జడ్జి కొట్టేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.

'విచక్షణాధికారం మాదే'

నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి విధించాలనే చట్టబద్ధ నిబంధన లేదన్న ఏపీ ఎస్​ఈసీ... ఎన్నికల కోడ్ అమలు విషయంలో విచక్షణాధికారం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది.

ఉదయం విచారించే అవకాశం..

ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఈ అప్పీల్​పై ఉదయం ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలుకు నిర్ణయం‌

ABOUT THE AUTHOR

...view details