పరిశీలకులు వారి పరిధిలోని అన్ని డివిజన్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు పరిశీలకులతో ఎస్ఈసీ సమావేశమయ్యారు. లెక్కింపు కోసం కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టాలని... 8.10కి కౌంటింగ్ టేబుళ్ల వద్ద ప్రాథమిక లెక్కింపు చేపట్టాలని సూచించారు.
'లెక్కింపు ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలి'
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు పరిశీలకులతో ఎస్ఈసీ పార్థసారథి సమావేశమయ్యారు. రేపు ఉదయం 8 గంటలకు ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టాలని... 8.10కి కౌంటింగ్ టేబుళ్ల వద్ద ప్రాథమిక లెక్కింపు చేపట్టాలని సూచించారు.
sec parthasarathy meeting with counting observers
మొత్తం 8152 కౌంటింగ్ సిబ్బంది ఉంటారని... ఒక్కో రౌండులో 14,000 ఓట్లు లెక్కిస్తారని పార్థసారథి వివరించారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్‌తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించామన్నారు. మొత్తం 34లక్షల 50 వేల 331 మంది ఓటు హక్కు వినియోగించుకోగా... 1926 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు ఎస్ఈసీ తెలిపారు.