గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా డివిజన్‌కు ఒకటి చొప్పున 150 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముఖకవళికలు గుర్తించేలా ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం జోన్ల వారీగా కమిషనర్లు, సాంకేతిక నిపుణులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ఈరోజుతో ముగిసింది.
'150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వినియోగం'
గ్రేటర్ ఎన్నికల కోసం జోన్ల వారీగా కమిషనర్లు, సాంకేతిక నిపుణులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ఈరోజుతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఈసీ పార్థసారథి... ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ-ఓటింగ్ కోసం ఐటీ శాఖతో కలిసి పనిచేస్తున్నామన్న ఎస్ఈసీ... మొత్తం దేశానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఈసీ పార్థసారథి... కొవిడ్ మహమ్మారి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో సమర్థత పెరగడంమే కాకుండా ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని తెలిపారు.
ముఖకవళికలు గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను గతంలో కొన్ని ఎన్నికల్లో వినియోగించగా మంచి ఫలితాలు వచ్చాయని, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఓటర్ను గుర్తించవచ్చని పార్థసారథి చెప్పారు. సీనియర్ సిటిజెన్లు, దివ్యాంగులు, పోలింగ్ సిబ్బందికి ప్రయోగాత్మకంగా ఈ-ఓటింగ్ అమలు చేయనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఈ-ఓటింగ్ కోసం ఐటీ శాఖతో కలిసి పనిచేస్తున్నామన్న ఎస్ఈసీ... మొత్తం దేశానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.