ఏపీలో తొలిదఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లను.. ఆన్లైన్ ద్వారా స్వీకరించకపోవడంపై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల మీద... ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నామినేషన్లు తీసుకోవాలని తాను ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై.. ఆదివారం ఎస్ఈసీ ఇచ్చిన నోటీసుకు సంజాయిషీ ఇచ్చేందుకు ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కలిశారు.
పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఏపీఎస్ఈసీ ఆగ్రహం
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఆ రాష్ట్ర ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆన్లైన్ ద్వారా స్వీకరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండో దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం నాటికి ఆన్లైన్లో నామినేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ ఆగ్రహం
తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై.. గంటపాటు జరిగిన సమావేశంలో ఎస్ఈసీ కారణాలు తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చిన సమాధానంపై... ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెండో దఫా నామినేషన్ల ప్రారంభం నాటికి ఆన్లైన్లో ప్రక్రియ ప్రారంభించాలని నిమ్మగడ్డ ఆదేశించినట్లు సమాచారం.