గవర్నర్‌కు, తనకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణలు.. కీలకమైన సమాచారం బయటకు పొక్కడంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని కోర్టు వేరే బెంచ్‌కు బదిలీ చేసింది.
ఏపీ ఎస్ఈసీ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ! - హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తన మధ్య జరిగిన సంభాషణలు లీక్ చేయడంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని నిమ్మగడ్డ.. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం వేరే బెంచ్‌కు బదిలీ చేసింది.
ఏపీ ఎస్ఈసీ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ!
గవర్నర్‌కు తాను రాసిన ఉత్తరప్రత్యుత్తరాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయని.. రాజ్‌భవన్ నుంచి బయటకు రావడంపై దర్యాప్తు చేయించాలని నిమ్మగడ్డ కోరారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శితోపాటు.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణను పిటిషన్‌లో చేర్చారు.
- ఇదీ చదవండి :నిర్భయ దోషుల 'ఉరి' అమలుకు నేటికి ఏడాది
TAGGED:
sec taza