ఏపీలో పంచాయతీ పోరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాశారు. ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని.. కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో కేంద్ర సిబ్బందిని ఇవ్వాలని లేఖలో ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ - ఏపీ పంచాయతీ ఎన్నికలు
ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని అంటున్నాయని లేఖలో పేర్కొన్నారు.
కేంద్రహోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ..