తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి' - పుర ఎన్నికలు

మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చూడాలని సూచించారు.

'ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమలు చేయండి'
'ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమలు చేయండి'

By

Published : Dec 24, 2019, 5:19 PM IST

ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి.. మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లతో నాగిరెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి కూడా సమీక్షలో పాల్గొన్నారు.

2019 జనవరి ఒకటో తేదీ ప్రామాణికంగా రూపొందించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎస్ఈసీ నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ నెల 27న కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 28న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు.

బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు...

పుర ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహించనున్నారు. బ్యాలెట్ పత్రాల కోసం అవసరమైన కాగితాన్ని, బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

'ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమలు చేయండి'

ABOUT THE AUTHOR

...view details