తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ ఎస్ఈసీ సమావేశం.. బహిష్కరించిన ప్రతిపక్షాలు - రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సమావేశం

ఏపీలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆ రాష్ట్ర ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశమయ్యారు. పరిషత్‌ ఎన్నికల నిర్వహణలో సహకారంపై చర్చించారు. ఈ భేటీకి వైకాపా, కాంగ్రెస్‌, సీపీఎం ప్రతినిధులు హాజరయ్యారు. తెదేపా, భాజపా, జనసేన, సీపీఐ ఇప్పటికే ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.

ap sec neelam sahni, ap sec,  neelam sahni
ఏపీ ఎస్​ఈసీ, ఏపీ ఎస్​ఈసీ నీలం సాహ్ని

By

Published : Apr 2, 2021, 1:37 PM IST

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడలో ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైకాపాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, సీపీఎం పార్టీ ప్రతినిధి హాజరయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ నేత మస్తాన్‌వలి హాజరై మధ్యలోనే బయటకు వచ్చారు.

ఎస్‌ఈసీ నిర్ణయం నియంతృత్వంగా ఉందని కాంగ్రెస్‌ నేత మస్తాన్‌ వలి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి సమావేశం ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ని కోరామని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరామని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి ఎస్​ఈసీని కోరారు. ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను తప్పించుకోవాలన్నదే ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

బహిష్కరించిన పలు పక్షాలు..

ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెదేపా, జనసేన, భాజపా ప్రకటించాయి. గురువారం సాయంత్రం సమావేశ ఆహ్వానం పంపిన ఎస్‌ఈసీ.. రాత్రి ఎన్నికల తేదీలను ప్రకటించడం, పాత నోటిఫికేషన్‌ ప్రకారమే నిర్వహిస్తామని నిర్ణయించడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నాయి.

హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు రాకముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక సమావేశం ఎందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కోర్టులో విచారణ జరుగుతున్నా ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారని... ఎస్ఈసీ నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని జనసేన నేత పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకేనని జనసేన భావిస్తున్నట్లు ఆయన వివరించారు.

'ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక సమావేశం ఎందుకు? ఎస్ఈసీ ఏర్పాటుచేసిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం '

-సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

' హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం'

-భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. నోటిఫికేషన్‌ రద్దుచేయాలని గతంలోనే ఎస్ఈసీని కోరాం. కోర్టులో విచారణ జరుగుతున్నా ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్ఈసీ నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది.

-జనసేన నేత పోతిన మహేశ్

ఎస్‌ఈసీ నిర్ణయం నియంతృత్వం. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్‌ చేశాం. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి సమావేశం ఏర్పాటుచేయాలని కోరాం.

-కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలి

ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించడం దారుణం. ఎన్నికలను తప్పించుకోవాలన్నదే ప్రతిపక్షాలు ప్రయత్నం

- వైకాపా నేత అప్పిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details