ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు కోరామన్నారు. సమావేశానికి 11 రాజకీయ పార్టీలు హాజరై అభిప్రాయాలు తెలిపాయని వెల్లడించారు. ప్రభుత్వ అభిప్రాయం కోసం సీఎస్‌తో ఎన్నికల సంఘం సమావేశమవుతుందని ఎస్‌ఈసీ వివరించారు.
'అన్ని విషయాల్లో ఎస్‌ఈసీ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తోంది' - ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 11 రాజకీయ పార్టీలు హాజరై తమ అభిప్రాయాలను తెలుపగా.. వైకాపా హాజరుకావట్లేదని తెలిపిందని నిమ్మగడ్డ తెలిపారు. ఎస్‌ఈసీపై వైకాపా నాయకుడి ప్రెస్‌నోట్ చూసి కమిషన్ ఆశ్చర్యపోయిందన్నారు.
సమావేశానికి హాజరుకావట్లేదని వైకాపా నాయకులు తెలిపినట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎస్‌ఈసీపై వైకాపా నాయకుని ప్రెస్‌నోట్ చూసి కమిషన్ ఆశ్చర్యపోయిందన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో గంటపాటు సమావేశం జరిపామన్న ఎస్‌ఈసీ.. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో చర్చలు జరిపామని అన్నారు. కొవిడ్ పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో చర్చించామని.. సంప్రదింపుల ప్రక్రియను గొప్ప అంశంగా కమిషన్ భావిస్తోందని వివరించారు. అన్ని విషయాల్లో సీఈసీ ఉత్తమ పద్ధతులను ఎస్‌ఈసీ అనుసరిస్తోందన్నారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను కమిషన్ గౌరవిస్తోందని వెల్లడించారు.
ఇదీ చదవండి:మంటలు చెలరేగి నాలుగు స్కూలు బస్సులు దగ్ధం