ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జల రామకృష్ణా రెడ్డిని తప్పించాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. తనపై సజ్జల చేస్తున్న విమర్శలను ఎస్‌ఈసీ.. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సలహాదారు రాజకీయ ప్రకటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సజ్జల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ గవర్నర్‍ను కోరారు.
ఏపీ:'ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించండి' - ap panchayth elections latest news
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని రాజకీయ ప్రకటనలు చేయడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జల రామకృష్ణా రెడ్డిని తప్పించాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు.
sec nimmagadda on sajjala
పెద్దిరెడ్డి, బొత్స, విజయసాయిరెడ్డి లక్ష్మణరేఖ దాటారని ఎస్‌ఈసీ అన్నారు. సజ్జల, బొత్స, పెద్దిరెడ్డి, విజయసాయి వైఖరిపై కోర్టుకు వెళ్లనున్నట్లు లేఖలో తెలిపారు. కోర్టుకు వెళ్లేముందు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.