తెలంగాణ

telangana

ETV Bharat / city

'పరిషత్ అభ్యర్థులకు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి'

ఏపీ పరిషత్ ఎన్నికల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు తప్పక పాటించాలని ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఒకసారి ఒక ఓటరునే అనుమతించాలని స్పష్టం చేశారు.

ap sec. ap sec neelam sahni
ఏపీ ఎస్​ఈసీ, ఏపీ ఎస్​ఈసీ నీలం సాహ్ని

By

Published : Apr 3, 2021, 6:50 AM IST

ఏపీ పరిషత్ ఎన్నికల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు తప్పక పాటించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశిస్తూ ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సీఈసీ నిబంధనల మేరకు అభ్యర్థులు, పార్టీలు వ్యవహరించాలని... పోలీసులు, ఎన్నికల సిబ్బందికి టీకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

'6 అడుగుల దూరం పాటించాలి'

ప్రచార వేళ 6 అడుగుల దూరం పాటించాలని స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఒకసారి ఒక ఓటరునే అనుమతించాలని చెప్పారు. ప్రచారంలో అభ్యర్థుల వెంట ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండకూడదని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details