గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈనెల 18 లోపు ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలని లేదంటే మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఎన్నికల వ్యయ పరిశీలకులతో ఎస్ఈసీ సమావేశమైంది.
18 లోపు ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి.. లేకుంటే.. - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈనెల 18 లోపు ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సూచించారు. లేదంటే మూడేళ్ల పాటు అనర్హత వేడు పడుతుందని హెచ్చరించారు.
మొత్తం పోటీచేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో ఇప్పటి వరకు 999 మంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించారని... మిగిలిన 123 మంది అభ్యర్థులు గడువులోగా ఇచ్చేలా చూడాలని సూచించారు. ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని అభ్యర్ధులకు తాఖీదులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యయ నిర్ధారణలో అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. మొత్తం వివరాలపై ఈ నెల 25వ తేదీ లోపు తుది నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు తెలిపారు.
ఇవీ చూడండి:శాటిలైట్ బస్ టెర్మినల్ శంకుస్థాపన వాయిదా