ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఉపసంహరణలపై కొన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. అటువంటి వాటిని అంగీకరించవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
మున్సి'పోల్స్': నామినేషన్ల ఉపసంహరణపై ఏపీఎస్ఈసీ కీలక ఆదేశాలు - ఎస్ఈసీ న్యూస్
ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దని స్పష్టం చేసింది.
![మున్సి'పోల్స్': నామినేషన్ల ఉపసంహరణపై ఏపీఎస్ఈసీ కీలక ఆదేశాలు ap municipals election update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10850251-607-10850251-1614753772245.jpg)
ap municipals election update
ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దని.. ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించింది. మూడో పక్షం నుంచి ఉపసంహరణలను అంగీకరించవద్దని ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కలెక్టరు, ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ఇవీచూడండి:నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు