తెలంగాణ

telangana

ETV Bharat / city

"అవనిలో సగం మేమే.. ఐనా మాపై వివక్షే".. కన్నీటి మహిళ సైకత శిల్పం - International Women's Day 2022

International Women's day: అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నా వారిపై ఇంకా వివక్ష మాత్రం తగ్గటంలేదని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంటున్న మహిళ సైకతా శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత దీనిని రూపొందించారు.

Feminine sculpture
కన్నీటి మహిళ సైకత శిల్పం

By

Published : Mar 7, 2022, 5:38 PM IST

International Women's day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత సైకత శిల్పాన్ని రూపొందించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నా వారిపై ఇంకా వివక్ష మాత్రం తగ్గటంలేదని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంటున్న మహిళ రూపాన్ని తీర్చిదిద్దారు.

అవనిలో సగం మేమే ఐనా.. మాపై వివక్షే, దయచేసి స్త్రీలను గౌరవించండి అనే నినాదాలతో రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. పది గంటలు శ్రమించి సైకత శిల్పాన్ని రూపొందించినట్లు అక్కాచెల్లెళ్లు దేవిన సోహిత, ధన్యతలు తెలిపారు.

కన్నీటి మహిళ సైకత శిల్పం

ఇదీ చదవండి:విజయవాడలో పలు సంఘాలతో బ్రదర్ అనిల్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ !

ABOUT THE AUTHOR

...view details