తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.. చెప్పుతో కొట్టుకుంటూ నిరసన' - ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ చెప్పుతో కొట్టుకుంటూ నిరసన

ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ చెప్పుతో కొట్టుకుంటూ జై భీమ్‌ సంఘం నేత నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే విదేశీ విద్యను పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు పేదల జీవితాలు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెప్పుతో కొట్టుకుంటూ నిరసన
చెప్పుతో కొట్టుకుంటూ నిరసన

By

Published : Apr 14, 2021, 5:20 PM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అనంతపురంలో జై భీమ్‌ సంఘం నేత తనను తాను చెప్పుతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే విదేశీ విద్యను పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతో మంది పేద విద్యార్థులు విదేశాల్లో చదువుతూ.. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అవకాశమిస్తే.. పేద ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం విద్యార్థులకు అందించే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే: కేటీఆర్​‌

ABOUT THE AUTHOR

...view details