తెలంగాణ

telangana

ETV Bharat / city

సహాయం చేస్తున్న సైబర్ సైన్యం - scsc helps in corona lock down situation

కొంతమంది మానవతా మూర్తులు లాక్‌డౌన్‌ సమయంలోనూ ఔదర్యాం చాటుతున్నారు. ఇంటి నుంచి ఉద్యోగాలు చేస్తూ పేదలకు సాయపడుతున్నారు.

scsc helps in corona lock down situation
సహాయం చేస్తున్న సైబర్ సైన్యం

By

Published : Apr 19, 2020, 5:39 PM IST

ఐటీ సంస్థలకు కేంద్రం సైబరాబాద్. దేశ విదేశాలకు చెందిన కంపెనీలు వందల సంఖ్యలో ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 5లక్షల మందికి పైగానే ఐటీ ఉద్యోగులున్నారు. ఐటీ సంస్థలకు అనుబంధంగా నిర్మాణ రంగం సైబరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇతర పరిశ్రమల్లో కార్మికులు, సెక్యూరిటీగార్డులుగా పనిచేయడానికి.... ఇళ్లల్లో పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల మంది వలస వచ్చారు. కరోనా ప్రభావంతో వలస కూలీలెవరికీ పనిలేకుండా పోయింది.

సహాయం చేస్తున్న సైబర్ సైన్యం

వీధిన పడ్డ కార్మికులందరికీ సైబరాబాద్ పోలీసులు అండగా నిలిచారు. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో వలస కూలీలను ఆదుకుంటున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొవిడ్-19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 94906-17440, 94906-17431 నెంబర్లకు బాధితులు ఫోన్ చేస్తే పోలీసులు వాటిని నమోదు చేసుకుంటున్నారు. ఆ వివరాలను సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్- SCSCకి అందజేస్తున్నారు. ఆ సంస్థ వాలంటీర్లు బాధితుల వివరాలు సేకరించి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పలు కార్పొరేట్, ఐటీ సంస్థలు కరోనా బాధితులను ఆదుకునేందుకు సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఆర్థిక సాయం అందిస్తున్నాయి.

ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న టెకీలు 2వేల మంది సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 300మంది వాలంటీర్లు కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు. నిత్యావసర సరకులు, ఆహారం అందించడంతో పాటు.. అత్యవసరం ఉన్న వాళ్లకు అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు 350 మందిని ఆస్పత్రులకు తీసుకెళ్లి తిరిగి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. వృద్ధులు, సహాయార్ధులు కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేస్తే ఔషధాలు అందజేస్తున్నారు. రాబిన్ హుడ్ ఆర్మీ, యంగిస్థాన్ తదితర స్వచ్ఛంద సంస్థల సహకారంతో... అవసరమైన వాళ్లకు ఆహారం అందిస్తున్నారు. రోజు సుమారు 35వేల మందికి రోజుకు రెండుపూటల భోజనం పెడుతున్నారు. రోజు వేయి మందికి వారానికి సరిపడా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. మరో పదిహేను రోజుల పాటు.... సేవలు అందించే విధంగా సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆ మేరకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటోంది.

సాయం కావాలంటే.. కింది నెంబర్లకు కాల్ చేయండి

94906-17440, 94906-17431

ఇదీ చూడండి:దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్‌ ప్రభావం?

ABOUT THE AUTHOR

...view details