ఆంధ్రప్రదేశ్‌లో కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యా సంస్థలను సోమవారం నుంచి తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 22 నుంచి ఆల్‌లైన్ బోధన, టెలి కౌన్సెలింగ్, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాలు నివృత్తికి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లొచ్చు.
ఏపీలో రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు - Schools will open from tomorrow in andhra pradesh
కరోనా వ్యాప్తి కారణంగా ఇంత కాలం పాఠశాలలు, కాలేజీలను తెరవలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరచుకోనున్నాయి. సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. 1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు.
రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు
1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు. రెసిడెన్షియల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సప్ గ్రూపు ద్వారా ఆన్లైన్ లో మార్గనిర్దేశం చేస్తారు. కావాలనుకుంటే వీరు సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయుల సూచనలు, మార్గదర్శకాలు తీసుకోవచ్చు. విద్యావారధి, వద్యామృతం వంటి కార్యక్రమాలు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయి.