schools open: అప్పటి వరకు ఆన్‌లైన్ క్లాసులే.. ఆరోజు నుంచే ప్రారంభం..!
15:35 February 11
schools open: అప్పటి వరకు ఆన్‌లైన్ క్లాసులే.. ఆరోజు నుంచే ప్రారంభం..!
schools open: రాష్ట్రంలో ఒకటి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 14 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. భౌతిక తరగతులు మాత్రం ఫిబ్రవరి 28 నుంచి మాత్రమే ప్రారంభమవుతాయని వెల్లడించింది. దీనిపై ఆ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
గతంలో ఒడిశా ప్రభుత్వం ఒకటి నుంచి 9వ తరగతుల వారికి భౌతిక క్లాసులు ప్రారంభించాలని కోరింది. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను కూడా ఎంచుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఫిబ్రవరి 27 వరకు ఆన్‌లైన్ తరగతులకు హాజరవ్వాలని.. ఫిబ్రవరి 28 నుంచి మాత్రమే పాఠశాలలకు రావాలని బిష్ణుపాద సేథి తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయులు ఫిబ్రవరి 14 నుంచి పాఠశాలకు రావాలని.. స్కూళ్లను పూర్తిగా శానిటైజేషన్ చేయాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: