schools reopen: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే స్కూల్స్ రీఓపెన్ - schools reopen: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే స్కూల్స్ రీఓపెన్
16:24 January 23
schools reopen: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే స్కూల్స్ రీఓపెన్
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్రలో మూతపడిన పాఠశాలలు రేపటి నుంచి తిరిగి తెరచుకోనున్నాయి. సోమవారం నుంచి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలు కొవిడ్ ప్రొటోకాల్స్‌కు కట్టుబడి ఉండేలా చర్యలు చేపడతామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు.
అయితే పాఠశాలల పున:ప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారు.