తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో విద్యాసంస్థలు పునఃప్రారంభం షెడ్యూల్​ విడుదల - ఏపీలో పాఠశాలల ప్రారంభంపై తాజా వార్తలు

ఏపీలో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఏపీ సీఎస్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. రోజు విడిచి రోజు ఒంటిపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు.

schools and colleges will reopen in Andhra
ఏపీలో విద్యాసంస్థలు పునఃప్రారంభం షెడ్యూల్​ విడుదల

By

Published : Oct 29, 2020, 5:26 PM IST

ఏపీలో బడి గంటలు మోగనున్నాయి. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు జరగనున్నాయి. తరగతుల పునఃప్రారంభంపై ఏపీ సీఎస్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. రోజు విడిచి రోజు ఒంటిపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు.

ఉన్నత విద్యకు సంబంధించి నవంబర్‌ 2 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. నవంబర్‌ 2 నుంచి 9, 10 తరగతులు, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులు మొదలవుతాయి. నవంబర్‌ 12 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. నవంబర్‌ 23 నుంచి 6, 7, 8 తరగతులకు బోధన మొదలుపెడతారు. డిసెంబర్‌ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులు ప్రారంభిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్‌ వర్తింపు కానుంది.

ఇవీ చూడండి:'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం

ABOUT THE AUTHOR

...view details