తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో ఆరుగురు చిన్నారులపై ఎస్సీ ఎస్టీ కేసు.. - కర్నూలు జిల్లాలో తాజా వార్తలు

10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు పిల్లలపై ఏపీలోని ముచ్చుమర్రి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ట్యాంకులో చిన్నారులు మూత్ర విసర్జన చేస్తుండగా.. దంపతులు అడ్డుకున్నారు. వారిని ప్రశ్నించగా గ్రామస్థుల సూచనలతోనే  ఇలా చేసినట్లు పిల్లలు చెప్పారు. దంపతుల ఫిర్యాదు మేరకు పిల్లలతోపాటు ప్రోత్సహించిన వారందరిపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

sc-st-case-against-minors-in-kurnool-district
ఏపీలో ఆరుగురు చిన్నారులపై ఎస్సీ ఎస్టీ కేసు..

By

Published : Nov 26, 2020, 11:50 AM IST

ఏపీలోని కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోటలో 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు పిల్లలపై ముచ్చుమర్రి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ప్రాతకోటలో ఓవర్‌హెడ్‌ ట్యాంకులో ఆరుగురు చిన్నారులు మూత్రం పోస్తుండగా సురేఖ, రమణ దంపతులు అడ్డుకున్నారు. వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. ముగ్గురు పారిపోయారు. దొరికినవారిని ప్రశ్నించగా కొందరు గ్రామస్థుల సూచనలతోనే ఇలా చేసినట్లు పిల్లలు చెప్పారు.

దంపతుల ఫిర్యాదు మేరకు పిల్లలతోపాటు ప్రోత్సహించిన వారందరిపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. వారం క్రితం ప్రాతకోటలో ఎమ్మెల్యే ఆర్థర్‌ అనుచరులు చిన్నారులపై దాడి చేశారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే చిన్నారులపై కేసు నమోదైనట్లు సమాచారం.

ఇదీ చదవండి:రాజధాని భూ కొనుగోలు దర్యాప్తుపై హైకోర్టు స్టే యథాతథం: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details