రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల నుంచి 706 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచి అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత పొందారని ఆ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల నుంచి మొత్తం 1250 మంది విద్యార్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఎస్సీ గురుకులాల నుంచి 432 మంది, గిరిజన గురుకులాల నుంచి 274 మంది అడ్వాన్స్డ్‌కు అర్హత పొందారని వివరించారు.
జేఈఈ మెయిన్స్‌లో గురుకులాల విద్యార్థుల ప్రతిభ - JEE exam results
కార్పొరేట్ కళాశాలలతో పోటీగా... రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్టీ, బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలో 706 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, 35 మంది బీసీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు.

కార్పొరేట్ కళాశాలలతో పోటీగా విద్యార్థులు మంచి పర్సంటైల్ సాధించారని చెప్పారు. ఐఐటీ గౌలిదొడ్డి ఎస్సీ గురుకులానికి చెందిన శ్రవణ్‌కుమార్ 99.51, రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఐటీ స్టడీసర్కిల్ విద్యార్థి కాట్రోత్ అనిల్ 94.05 పర్సంటైల్ సాధించారు. హయత్‌నగర్ గిరిజన గురుకుల కళాశాలలో చదువుతున్న ఆదిమ గిరిజన జాతుల వర్గానికి చెందిన బాలిక నైనీ మమత 89.11 పర్సంటైల్ సాధించి అడ్వాన్స్డ్‌కు అర్హత పొందారు. గౌలిదొడ్డి ఐఐటీ మెడికల్ అకాడమీ నుంచి నిరంజన్ (99.29), వి.తరుణ్ (98.38), దిలీప్ (97.56), సామల సాయిప్రశంస (97.25), సునీల్ (96.28), మహేశ్ (96.23) విద్యార్థులున్నారు.
బీసీ గురుకులాల నుంచి 35 మందికి..
బీసీ గురుకుల కళాశాలల నుంచి 35 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించారని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు. సొసైటీ నుంచి 110 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యారని, వీరిలో 18 మంది బాలురు, 17 మంది బాలికలు అర్హత పొందారని పేర్కొన్నారు.