సాయుధ దళాల పతాక దినోత్సవ ఫండ్ కోసం రూ.25,19,800ల చెక్కును ఎస్బీఐ సర్కిల్ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు అందచేశారు. 2015 నుంచి ప్రతి ఏడాది ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఉద్యోగులు విరాళాలు సేకరించి అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో ఎస్బీఐలో పని చేస్తోన్న 7,438 మంది ఉద్యోగుల స్వచ్ఛంద విరాళాలను సేకరించారు. ఈ చెక్కును గవర్నర్‌కు ఓం ప్రకాశ్ మిశ్రా ఇచ్చారు.
సైనికుల సంక్షేమానికి 25 లక్షల విరాళమిచ్చిన ఎస్బీఐ - గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వార్తలు
సాయుధ దళాల పతాక దినోత్సవ ఫండ్ కోసం ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ భారీ విరాళమిచ్చింది. రూ.25,19,800ల చెక్కును సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు అందచేశారు. ఈ విరాళం మొత్తాన్ని ప్రధానంగా మాజీ సైనికుల సంక్షేమం, పునరావాసానికి ఉపయోగిస్తారు.
వెంటనే తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ సంచాలకులు కల్నల్ పి.రమేశ్‌కుమార్‌కు అందచేశారు. ఎస్బీఐ ఇచ్చే ఈ విరాళం మొత్తాన్ని ప్రధానంగా మాజీ సైనికుల సంక్షేమం, పునరావాసానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా తమ ప్రధాన కార్యాలయం నుంచి పది కోట్ల మొత్తాన్ని సాయుధ దళాల పతాక దినోత్సవానికి విరాళం ఇచ్చినట్లు సీజీఎం వివరించారు. ఈ విరాళం మొత్తాన్ని 8,333 మంది విద్యార్థినులకు ప్రతి నెల వేయి రూపాయల చొప్పున కేంద్రీయ సైనిక బోర్డు ఉపయోగిస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబరు 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పాటిస్తారు.
ఇదీ చూడండి:ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు