హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా గుప్త, పలువురు క్రీడాకారుల సమక్షంలో రోజూవారీ సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు.
నిత్యావసర సరుకులు అందించిన సాట్ ఛైర్మన్ - SAT CHAIRMAN HELPS POOR PEOPLE IN LOCK DOWN PERIOD
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి నిత్యావసర సరుకులు అందించారు.
నిత్యావసర సరుకులు అందించిన సాట్ ఛైర్మన్
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులతో సమానంగా, ధైర్యంగా పనిచేస్తూ.. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులను ఆయన ప్రశంచించారు. వరుసగా వారం రోజుల పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు, పలు మురికివాడలు, కాలనీల్లో కూడా నిత్యావసర వస్తువులు పంచనున్నట్టు వెంకటేశ్వర రెడ్డి ప్రకటించారు.
ఇదీ చదవండి: ఆర్ఎంపీకి కరోనా అంటూ ప్రచారం.. కొట్టిపారేసిన వైద్యుడు