సర్వశిక్షా అభియాన్‌లో పని చేస్తున్న తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తాత్కాలిక ఉపాధ్యాయులు హైదరాబాద్లో నిరసనకు దిగారు. లక్డీకపూల్లో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నాలుగు రోజులుగా నిరసన చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడం వల్ల సర్వ శిక్షా అభియాన్‌లో పని చేస్తున్న తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ప్రతి ఏడాది ఇదే ఇబ్బంది.. అయినా ఎవరికీ పట్టదు' - Sarva Shiksha Abhiyan staff protest in Hyderabad
సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో తాత్కాలిక ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. లక్డీకపూల్లో నాలుగురోజులుగా నిరసన చేస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
కేంద్రం బడ్జెట్ విడుదల చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విధులు తిరిగి అప్పగించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వ శిక్షా అభియాన్‌లో 13 విభాగాల్లో పన్నెండింటిలో ఉన్న వారిని రీఎంగేజ్ చేశారని.. తమను మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. కమిషనర్ తమ గోడు వినే వరకు కదలమని తేల్చి చెప్పారు. కమిషనర్ కోసం మూడు రోజులుగా వేచి చూస్తున్నామని.. ఆయన వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సాధారణ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా ప్రతి ఏడాది రీఎంగేజ్ సమయంలో ఇబ్బంది పడాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని... లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి :న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు