కరోనా వైరస్ కట్టడి చర్యల కోసం సీఎం సహాయనిధికి రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. సర్పంచ్ల సంఘం ప్రతినిధులు లక్ష్మీనరసింహారెడ్డి, ధనలక్ష్మి, చందర్ తదితరులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి లేఖను అందచేశారు. త్వరలోనే చెక్కును అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించారన్నారు.
సీఎం సహాయనిధికి సర్పంచుల సంఘం విరాళం - తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళాలు
కొవిడ్ నియంత్రణ చర్యల కోసం సీఎం సహాయనిధికి రాష్ట్రసర్పంచ్ల సంఘం ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. సంబంధిత లేఖను మంత్రి ఎర్రబెల్లికి సర్పంచ్ల సంఘం ప్రతినిధులు అందించారు.

సీఎం సహాయనిధికి సర్పంచుల సంఘం విరాళం
రాష్ట్రంలోని 12 వేల 751 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ఒక నెల వేతనం అంటే రూ.6 కోట్ల 37 లక్షల 55వేలు సీఎం సహాయ నిధికి అందనుంది.
ఇవీచూడండి:వెయ్యి కి.మీ రోడ్డు పనులకు నిధుల విడుదల : ఎర్రబెల్లి