ఏపీలోని నెల్లూరు జిల్లా కేంద్రం శివారు ప్రాంతం.. భగత్ సింగ్ కాలనీ. పక్కనే జనార్ధనరెడ్డి కాలనీ. ఈ రెండూ కాలనీలు మురికివాడలే. ఈ కాలనీలకు చెందిన కిరణ్ వయస్సు 19 ఏళ్లు. తొమ్మిదో తరగతితో చదువు ఆపేశాడు. కూలీ పనులకు వెళ్తుంటాడు. లాయక్ ఇంటర్ పూర్తి చేశాడు. ఈ యువకుడు కూడా దుకాణంలో పనిచేస్తున్నాడు. మున్నా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వయసులో తేడాలున్నా ముగ్గురూ స్నేహితులది ఒకేరకమైన ఆలోచన. అవకాశాలు వస్తే సినిమాల్లోకి వెళ్లాలనే తపన. అందుకే తమ నైపుణ్యానికి పదును పెట్టేందుకు షార్ట్ ఫిల్మ్‌లు తీస్తున్నారు.
ఈ క్రమంలోనే వీరికి ఓ ఆలోచన వచ్చింది. హీరో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో యాక్షన్ సిక్వెల్స్ చిత్రీకరణ చేశారు. మెుదట కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్ సీన్ తీశారు. అచ్చుగుద్దినట్లు ఎడిటింగ్ చేశారు. స్లమ్ ఏరియాలో చిన్నపిల్లలతో చిత్రీకరించి.. వారెవ్వా అనిపించుకున్నారు. మరో ఫైట్.. ఇంకా గొప్పగా చిత్రీకరించారు. రమణా... లోడెత్తాలిరా అనే డైలాగ్‌తో మొదలైన సీన్‌ను దింపేశారు. కేవలం సెల్‌ఫోన్‌తోనే వీడియో తీసి.. ఎడిటింగ్ చేశారు. సరదాగా తీసిన ఈ రెండు ఫైట్లను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.