సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రవీంద్ర భారతిలో సర్దార్ పాపన్న 370వ జయంతి వేడుకలు - sardar sarvai papanna goud birth anniversary
బహుజన వర్గాల వారి అభివృద్ధికి సర్దార్ సర్వాయి పాపన్న ఎనలేని కృషి చేశారని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సర్వాయి పాపన్న 370వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
రవీంద్ర భారతిలో సర్దార్ పాపన్న 370వ జయంతి వేడుకలు
పేదప్రజలను సమీకరించి పాపన్న చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజానీకం ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
TAGGED:
PAPANNA GOUD